మహేశ్ బాబు ‘దమ్ మసాలా’ సాంగ్ వచ్చేసింది..

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం
  • తొలి సింగిల్ దమ్ మసాలా విడుదల చేసిన చిత్రబృందం
  • తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
Mahesh Babu Dum Masala lyrical video out now

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం. ఇందులో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కాగా, గుంటూరు కారం చిత్రం నుంచి తొలి సింగిల్ నేడు విడుదలైంది. దమ్ మసాలా అంటూ సాగే ఈ గీతం లిరికల్ వీడియో చూస్తే… పూర్తిగా మహేశ్ బాబు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సాగుతుంది. ఈ చిత్రం నుంచి రిలీజైన తొలి పాట ఇదే. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం, రామజోగయ్య పద చమత్కారం పాటను మరోస్థాయిలో నిలిపాయి. దమ్ మసాలా సాంగ్ వీడియోను మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!