మరో ప్రయోగాత్మక చిత్రంలో సూర్య!

తమిళంలో కమల్ .. విక్రమ్ తరువాత ప్రయోగాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపే హీరోగా సూర్య కనిపిస్తాడు. ’24’ .. ‘సెవెంత్ సెన్స్’ .. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన కెరియర్లో కనిపిస్తాయి. ’24’ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించిన సూర్య, మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. 

తమిళ దర్శకుడు ఆర్. రవికుమార్ ఒక విభిన్నమైన కథను సూర్యకి వినిపించాడట. తన కెరియర్ లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అనిపించడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. పూర్తి స్క్రిప్ట్ పై రవికుమార్ కసరత్తు చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. 

 ఇటీవల సూర్య నుంచి వచ్చిన ‘ఈటి’ తమిళంలో అంతంత మాత్రంగా ఆడింది. తెలుగులో ఎవరూ ఈ సినిమాను పట్టించుకోలేదు. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ   సినిమా తరువాత ఆయన రవికుమార్ ప్రాజెక్టుపైకి వెళతాడని చెబుతున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!