మధ్యాహ్న భోజనం తిని విద్యార్థి మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం

FOOD POISONING red Rubber Stamp over a white background.

అమరావతి : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు.అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వండిన ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంపిళ్లను సేకరించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!