మంచు ఫ్యామిలీ సినిమాపై స్పందించిన విష్ణు!

  • తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు విష్ణు
  • బయట హీరోలతో సినిమాలు నిర్మిస్తానని వ్యాఖ్య
  • విలన్ గా కనిపించాలని ఉందంటూ మనసులో మాట
  • నిర్మాతగా తన డ్రీమ్ ఏమిటనేది చెప్పిన విష్ణు
మంచు విష్ణు ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన ‘జిన్నా’ ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ .. “లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఉండగా, 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ ఎందుకు పెట్టారని అంతా అడుగుతున్నారు. నిజానికి ఈ బ్యానర్ పెట్టింది బయట హీరోలతో సినిమాలు చేద్దామని.

నవంబర్ నుంచి కొత్త ఎనౌన్స్ మెంట్స్ ఉంటాయి .. బయట హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళతాను. ఏడాది పాటు నెలకి ఒక సినిమా మా బ్యానర్ నుంచి థియేటర్ కి వెళ్లేలా చేయాలనే కోరిక ఒకటి ఎప్పటి నుంచో ఉంది. అది నా కల ..  ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. ఇక నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందా? హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఉందా? అంటే, హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకోవడమే నాకు ఇష్టం.

ఇప్పుడున్న అందరి హీరోలతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందరితోనూ కలిసి నటించాలని ఉంది. నటుడిగా ఛాలెంజింగ్ రోల్స్ చేయగలననే నమ్మకం నాకు ఉంది. నాకు విలన్ గా కూడా చేయాలని ఉంది .. కానీ నవ్వితే బుగ్గలు సొట్టలు పడతాయి .. విలన్ గా ఎలా పనికొస్తావు? అని అడుగుతుంటారు. కానీ నాకు పవర్ ఫుల్ విలన్ గా కనిపించాలని ఉంది. ఇక మా ఫ్యామిలీ మొత్తం కలిసి నటించే సినిమా రాకపోవచ్చు. అందరం కలిసి చేసినా,  తెరపై మమ్మల్ని ఆడియన్స్ ఎవరికి వారిగానే చూస్తారు. అయినా అందుకు తగిన కథ దొరకడం చాలా కష్టం ” అంటూ చెప్పుకొచ్చాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!