‘భీష్మ’ దర్శకుడితో బాలయ్య!

  • షూటింగు దశలో బాలయ్య  ‘వీరశంకర్ రెడ్డి’
  • రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
  • తరువాత ప్రాజెక్టు అనిల్ రావిపూడితో
  • లైన్లో వెంకీ కుడుముల
సాధారణంగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు మరో ప్రాజెక్టు సెట్ చేసుకోవడానికి సమయం పడుతుంటుంది. అలాంటిది ‘ఛలో’ .. ‘భీష్మ’ వంటి రెండు హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల, ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. ఆ మధ్య చిరంజీవితో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పాడు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే మెహర్ రమేశ్ సినిమా కూడా పూర్తికావలసి ఉంటుంది.

అయితే బాలకృష్ణకి కూడా ఒక కథను చెప్పి ఒప్పించడంలో వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడుస్తుందనీ, కథ వినగానే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ  డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ. ఈ సినిమా తరువాతనే ఆయన వెంకీ కుడుములతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మరి వెంకీ కుడుముల ముందుగా చిరూ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడా? లేదంటే బాలయ్యతో చేస్తాడా? అనేది చూడాలి.

Nationalist Voice

About Author

error: Content is protected !!