భీమవరం చేరుకున్న మోదీ, జగన్

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ భీమవరంకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వీరు ముగ్గురూ ఒకే హెలికాప్టర్ లో భీమవరంకు వచ్చారు. భీమవరంలోని ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెద అమిరంలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రూ. 3 కోట్ల వ్యయంతో తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని 15 టన్నుల బరువుతో, 30 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ప్రసాద్ అనే శిల్పి దీన్ని 30 రోజుల్లో తయారు చేశారు.  
Nationalist Voice

About Author

error: Content is protected !!