భిక్షాటనకు మోటారు బైకు కొన్న వృద్ధ దంపతులు

  • మధ్యప్రదేశ్ లోని చింద్వారా పట్టణంలో కనిపించిన దృశ్యం
  • వృద్ధాప్యం కారణంగా ట్రైసైకిల్ నడపలేని పరిస్థితి
  • కూడబెట్టుకున్న రూ.90 వేలతో మోటారు వాహనం కొనుగోలు
  • దూర ప్రాంతాలకు వెళుతున్నామన్న భిక్షకులు
ఈ దంపతుల వయసు 60కు దగ్గర పడింది. రోజూవారీ భిక్షాటనే వారికి జీవనోపాధి. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా కేంద్రంలో వీరు ట్రై సైకిల్ (మూడు చక్రాల సైకిల్) ద్వారా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సంతోష్ కుమార్ సాహుకు కాళ్లలో వైకల్యం ఉంది. అందుకే అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే.. అతడి భార్య సైకిల్ ను వెనుక నుంచి నెట్టేది.

ఆలయాలు, మసీదుల వద్ద వీరు అడ్డుక్కునేవారు. అయితే, వయసు పెరగడం, కచ్చా రోడ్లు, ఎత్తయిన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో సాహు భార్యకు నడుము నొప్పి వేధించసాగింది. ఆమె నొప్పితో నరకాన్ని అనుభవిస్తుంటే సాహు చూడలేకపోయాడు. ఇంతకాలం రూపాయి, రూపాయి అడుక్కుని కూడబెట్టుకున్న సొమ్ముతో త్రిచక్ర మోటారు మోపెడ్ ను కొనుగోలు చేశాడు. రూ.90,000 ఖర్చు అయింది. దీంతో తోసే పని తప్పింది. దాంతో ఇద్దరూ కలసి సులభంగా ఎక్కడికైనా చేరుకుని భిక్షాటన వృత్తిని చేసుకుంటున్నారు.

అయితే ఈ బైక్ తో వచ్చిన మార్పు ఏంటంటే.. మోటారు వాహనం వల్ల తాము ఇప్పుడు సియోని, ఇటార్సీ, భోపాల్, ఇండోర్ ప్రాంతాలకు కూడా వెళ్లి అడుక్కోగలుగుతున్నట్టు సాహు చెప్పాడు. వీరి సంపాద రోజువారీగా గతంలో అయితే రూ.300-400 వరకు ఉండేది. మారుతున్న జీవన విధానాలు, ఖర్చు పెట్టే ధోరణలకు ఇది కూడా ఒక నిదర్శనమే.

Nationalist Voice

About Author

error: Content is protected !!