బోనాల పండుగ‌.. హైద‌రాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ : ఈ నెల 24న లాల్ ద‌ర్వాజ బోనాల పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫ‌ల‌క్‌నుమా, బ‌హ‌దూర్‌పురా ఏరియాల్లో ఆది, సోమ‌వారాల్లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల‌కు వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

మ‌దీనా క్రాస్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వ‌ర‌కు ర‌హ‌దారిని మూసివేయ‌నున్నారు. చార్మినార్, చార్మినార్ బ‌స్ టెర్మిన‌ల్, హిమ్మ‌త్‌పురా, నాగుల్‌చింత‌, అలియాబాద్ ర‌హ‌దారుల‌ను కూడా మూసివేయ‌నున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చార్మినార్, ఫ‌ల‌క్‌నుమా, నయాపూల్ వైపు ఆర్టీసీ బ‌స్సుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని వెల్ల‌డించారు. సీబీఎస్, అప్జ‌ల్‌గంజ్‌, దారుల్‌షిఫా క్రాస్ రోడ్డు నుంచి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని వాహ‌న‌దారుల‌కు సూచించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!