బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విపక్షాల తరపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కేసీఆర్, యశ్వంత్ సిన్హా ర్యాలీగా నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు చేరుకోనున్నారు. దాదాపు వెయ్యి బైక్ లతో ర్యాలీ జరగనుంది. జలవిహార్ లో ఇరువురూ చర్చలు జరపనున్నారు. కేసీఆర్, సిన్హా ఇద్దరూ మధ్యాహ్నం అక్కడే భోజనం చేయనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రధని మోదీ హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!