బీజేపీకి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ రాజీనామా

  • తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న భిక్షమయ్య గౌడ్
  • తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని మండిపాటు
  • బీసీ నేతలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్య
తెలంగాణలోని ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ వివక్షను చూపుతోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ అన్యాయాన్ని సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీలో కొనసాగడంలో అర్థం లేదని ఆయన అన్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. బీసీ నేతలను బీజేపీలో పట్టించుకునేవాళ్లే లేరని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై అధిష్ఠానానికి పట్టు లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!