బియ్యం ఇస్తున్నది కేంద్రమే.. వైసీపీ ప్రభుత్వం కాదు: సీఎం రమేశ్

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి కేకలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. అయినప్పటికీ బియ్యాన్ని తామే పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు లేవని చెప్పారు. 
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పథకాన్ని విద్యా కానుకగా అందిస్తోందని సీఎం రమేశ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకుని తామే అమలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు తప్ప… చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!