‘బింబిసార 2’ ఎప్పుడు మొదలవుతుందో చెప్పిన డైరెక్టర్!

  • ఘన విజయాన్ని సాధించిన ‘బింబిసార’
  • ఈ నెల 21 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
  • సీక్వెల్ కథపై కసరత్తు జరుగుతుందన్న దర్శకుడు
  • జూన్ .. జులై నెలల్లో పట్టాలెక్కుతుందని వెల్లడి
కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ఠ ‘బింబిసార’ సినిమాను రూపొందించాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఆగస్టు 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. సంయుక్త మీనన్ – కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

ఈ నెల 21వ తేదీనే ఈ సినిమా ‘జీ 5’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ గురించిన మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్న దర్శకుడికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ‘అంతా అనుకుంటున్నట్టుగా ఈ సినిమా సీక్వెల్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పేశాడు.

‘బింబిసార’ ఘన విజయాన్ని సాధించించింది. ఆ తరువాత రానున్న సీక్వెల్ అంతకుమించి అన్నట్టుగా ఉండాలి. అందుకు తగిన కసరత్తు చేయడానికి సమయం పడుతుంది. ఇక ఈ లోగా కల్యాణ్ రామ్ తన కమిట్ మెంట్స్ ను పూర్తిచేయవలసి ఉంటుంది. వచ్చే జూన్ .. జులై నెలల్లో సీక్వెల్ పట్టాలెక్కవచ్చు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. సీక్వెల్ లో ఎన్టీఆర్ గెస్టు రోల్ చేయవచ్చనే కల్యాణ్ రామ్ మాటపై వశిష్ఠ మాత్రం స్పందించలేదు.

Nationalist Voice

About Author

error: Content is protected !!