బాల్య వివాహం ! కేసు నమోదు

నేషనలిస్ట్ వాయిస్, మే 16, షాద్ నగర్ రూరల్ :  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట  మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ ఆమ్లెట్ గ్రామమైన ఆవాజ్ మియా పడకల్  గ్రామంలో బుడగ జంగాలకు చెందిన శారద (12) అనే అమ్మాయికి వెలిచెర్ల గ్రామానికి చెందిన రవి (30) అనే వ్యక్తితో ఈ నెల 13వ తేది వివాహం జరిపించినట్లు గ్రామస్తులు స్థానిక మహిళా సంఘం నేత లక్ష్మీ దృష్టికి తేవడంతో ఆమె సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిణి (సిడిపిఓ)  నాగమణి, సూపర్వైజర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లడంతో వారి సిబ్బందితో వచ్చి గ్రామంలో విచారణ జరిపి మైనర్ అమ్మాయికి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని,  ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో ఎస్సై ప్రవీణ్ కుమార్ వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!