ప్లేయర్లకు ప్రభుత్వ సాయం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 

 

  • పవర్‌ లిఫ్టర్‌ మల్లికకు ఎంపీ రంజిత్‌రెడ్డి 2 లక్షల చెక్‌

శంషాబాద్‌ రూరల్‌: ప్రతిభకు తగిన గుర్తింపు దక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి గొల్లపల్లికి చెందిన మల్లికా రాఘవేందర్‌గౌడ్‌ను క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం అభినందించారు.

ఇటీవల కొయంబత్తూరు వేదికగా జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో పాటు స్ట్రాంగ్‌ వుమన్‌గా నిలిచిన మల్లికకు ప్రభ్వుతం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో సంప్రదించి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్లేయర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి మరింత ప్రాతినిధ్యం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ రంజిత్‌రెడ్డి.. మల్లికకు రూ.2 లక్షల చెక్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, గణేశ్‌గుప్తా, వెంకటేశ్‌గౌడ్‌, గోపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!