ప్రమాదంలో కన్నుమూసి.. మరి కొందరికి జీవితాన్నిచ్చి..

చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు, పూజలేవీ ఫలించలేదు. తొమ్మిది రోజుల పాటు కొన ఊపిరితో పోరాడిన యువకుడికి శుక్రవా రం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. కొడుకు ఇక తిరిగి రాడు అని తెలిసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. కుమారుడిని ఇక చూడలేము అని తెలిసినప్పటికీ అతడిలోని అవయవాలను మరి కొందరికి ఇచ్చి వారిలో తమ బిడ్డను చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. జీవన్‌ దాన్‌ సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తికి వారు స్పందించి అవయవాలను దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.., ఎల్బీనగర్‌, నాగోల్‌ డివిజన్‌, కో ఆపరేటివ్‌ బ్యాం కు కాలనీలో అనిల్‌ కుమార్‌ రెడ్డి, విద్య దంపతులు నివాసముంటున్నారు.

వీరికి కుమారుడు మలిపెద్ది యశ్వంత్‌ రెడ్డి(26) గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఈ నెల 21న నగరంలోని స్నేహితుల ఇంటికి వెళ్లి న యశ్వంత్‌రెడ్డి తెల్లవారు జామున 3 గంటలకు బైకుపై తిరిగి వస్తున్న తరుణంలో రైల్‌ నిలయం వద్ద రోడ్డు ప్ర మాదానికి గురయ్యాడు. తీ వ్రంగా గాయపడిన యశ్వంత్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సో మాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. నాటి నుంచి చికిత్స పొందుతున్న యశ్వంత్‌రెడ్డికి శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది.

దీంతో ఇక కొడుకు బతకడని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. జీవన్‌ దాన్‌ సంస్థ ప్రతినిధులు యశ్వంత్‌రెడ్డి తల్లిదండ్రులను కలిసి అవయవదానాల విషయాన్ని వివరించారు. తమ కు మారుడు తిరిగి రాలేడనే బాధలో ఉండి కూడా జీవన్‌ దాన్‌ సంస్థ ప్రతినిధుల సూచనలకు అంగీకరించారు. కుమారుడి అవయవాలను దానం చేసి మరి కొందరికి కొత్త జీవితాన్ని అందించారు. శనివారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసిన వైద్యులు అవయవాలు తీసుకునే ప్రక్రియను పూర్తి చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!