ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తిన రాజస్థాన్ సీఎం

  • దేశాలలో ప్రధాని మోదీ ఎంతో గౌరవం పొందుతున్నారని వ్యాఖ్య
  • గాంధీ దేశానికి ప్రధాని కావడం వల్లేనన్న గెహ్లాట్
  • మన ప్రజాస్వామ్యం గొప్పతనంగా అభివర్ణన
బీజేపీని తీవ్రంగా విమర్శించే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ప్రధాని మోదీ ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానిపై గెహ్లాట్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు గొప్ప గౌరవం లభిస్తోందంటూ.. గాంధీ దేశానికి ప్రధాని కావడం వల్లేనన్నారు. రాజస్థాన్ లోని బన్స్ వారా జిల్లా మన్ గఢ్ ధామ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరు ఇరువురూ హాజరయ్యారు. 1913లో బ్రిటిషర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భిల్ ఆదీవాసీ వర్గం ప్రజలను సన్మానించేందుకు ఈ కార్యక్రమం జరిగింది.

‘‘మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకుని ఉంది. ప్రపంచం దీన్ని గుర్తించింది. అందుకే ఈ దేశ ప్రధాని వస్తున్నందుకు వారు గవర్వపడుతున్నారు’’ అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నాడు బ్రిటిషర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన 1,500 మందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ లో తీగల వంతెన కుప్పకూలిన మోర్బీ ప్రాంతానికి వెళతారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!