ప్రతీ ముగ్గురు భారతీయుల్లో.. ఒకరు మధ్యతరగతి కుటుంబమే!: ప్రైస్ నివేదిక

  • వచ్చే పాతికేళ్లలో మధ్యతరగతి జనాభా రెట్టింపు
  • భారీగా పెరిగిన సూపర్ రిచ్ కుటుంబాలు
  • మహారాష్ట్రలోనే సంపన్నుల కుటుంబాలు ఎక్కువ
  • తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్
భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువని, ప్రతీ ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారేనని ప్రైస్ (పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియా కన్జూమర్ ఎకానమీ) నివేదిక తాజాగా తేల్చింది. అంతేకాదు, వచ్చే 25 ఏళ్లలో దేశంలోని మధ్య తరగతి జనాభా రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వార్షిక ఆదాయం 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉన్న కుటుంబాల శాతం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2004-05 లో రెట్టింపు అయిందని పేర్కొంది. రాజకీయ, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో 2047 నాటికి మధ్య తరగతి, ఉన్నత వర్గాల మధ్య అంతరం ఇంకా పెరుగుతుందని ప్రైస్ ఎండీ, సీఈవో రాజేష్ షుక్లా వ్యాఖ్యానించారు. 2047 నాటికి మధ్యతరగతి కుటుంబాలు 63శాతం పెరుగుతాయని తెలిపారు.

సంపన్నులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్..
ఏడాదికి రూ.2 కోట్లకు పైనే ఆర్జిస్తున్న కుటుంబాలు ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయని ప్రైస్ నివేదిక వెల్లడించింది. ఈ ఆదాయం ఉన్న 6.4 లక్షల కుటుంబాలు మహారాష్ట్రలో ఉన్నాయని వివరించింది. ఇక, 1.81 లక్షల కుటుంబాలతో(ఏటా రూ.2 కోట్ల పైనే ఆర్జించే) ఢిల్లీ రెండో స్థానంలో, 1.01 లక్షల కుటుంబాలతో గుజరాత్ మూడోస్థానంలో, 1.41 లక్షల కుటుంబాలతో తమిళనాడు నాలుగో స్థానంలో, 1.37 లక్షల కుటుంబాలతో పంజాబ్ ఐదో స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

భారీ సంఖ్యలో పెరిగిన ‘సూపర్ రిచ్ కుటుంబాలు’
1994-95 ఆర్థిక సంవత్సరంలో 98 వేలు ఉన్న సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య 2020-21 నాటికి 18 లక్షలకు చేరిందని ప్రైస్ నివేదిక పేర్కొంది. ప్రధానంగా సూరత్, నాగ్ పూర్ లలో సూపర్ రిచ్ కుటుంబాలు పెరిగాయని వివరించింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!