పోలీస్ స్టేషన్ ఆవరణలో నేలపై పడుకుని నిరసన తెలిపిన టీడీపీ యువ నేత

  • రిషికొండ అక్రమాలపై నిరసనకు టీడీపీ పిలుపు
  • విశాఖకు చెందిన టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పలనాయుడు తరలింపు
  • స్టేషన్ ఆవరణలో వినూత్న నిరసనకు దిగిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
విశాఖ పరిధిలోని రిషికొండలో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర జిల్లాల నుంచి విశాఖ రాకుండా ఆయా జిల్లాల నేతలను అడ్డుకుంటున్న పోలీసులు… విశాఖలోని నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అరెస్ట్ లను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు వినూత్న నిరసనకు దిగారు.

టీడీపీ నేతల అరెస్ట్ ల్లో భాగంగా అప్పలనాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు…ఆయనను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ ఆవరణలో ఆయనను కూర్చోబెట్టిన పోలీసులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల అరెస్ట్ లకు నిరసనగా అప్పలనాయుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నేలపై పడుకుని ఆయన నిరసన తెలిపారు. ఈ వినూత్న నిరసనను తన మొబైల్ లో రికార్డ్ చేసిన అప్పలనాయుడు… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!