పోలవరం చంద్రబాబు కల అట.. తన పుస్తకంలో ఓ అధ్యాయాన్నే రాసిన కేవీపీ

పోలవరంపై పుస్తకం రాసిన కేవీపీ రామచంద్రరావు
పోలవరం పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపణ
పోలవరం ప్రాజెక్టు పేరులోని ఇందిర పేరును చంద్రబాబు తొలగించారని విమర్శ
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరు పడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పోలవరంపై ”పోలవరం- ఓ సాహసి యాత్ర” పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో డెల్టా, రాయలసీమ ప్రాంతాల దుర్భిక్షానికి కారణాలతో పాటుగా పోలవరం ప్రాజెక్టు కోసం రాజశేఖరరెడ్డి చేసిన కృషిని సవివరంగా వివరించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ పుస్తకంలో చంద్రబాబుపై ”పోలవరం చంద్రబాబు కల అట” అంటూ కేవీపీ ఏకంగా ఓ అధ్యాయాన్నే రాశారు. పోలవరం పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అందులో కేవీపీ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పట్ల చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే… 1996- 2000లోనే పోలవరం ప్రాజెక్టు సాకారమయ్యేదని కూడా కేవీపీ రాసుకొచ్చారు. 2014 తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే… ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు పేరులో నుంచి ఇందిరా సాగర్ పేరును చంద్రబాబు తొలగించారన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే ఆ ప్రాజెక్టును చంద్రబాబు తన కలగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!