పేర్ని నాని నోటి విరేచనాలతో బాధ పడుతున్నారు: నాగబాబు

కొందరు వైసీపీ నేతలు, ముఖ్యంగా పేర్ని నాని వంటి వారు నోటి విరోచనాలతో బాధ పడుతున్నారని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పెట్టిన తిండి అరగక నోటి కొచ్చినట్టు పేర్ని నాని వాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు అప్పుడప్పుడు సాత్వికమైన ఆహారాన్ని పెట్టాలని తమ అధినేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నానని చెప్పారు. బందరులో పేర్ని నానికి దగ్గర్లో ఎవరైనా డాక్టర్ ఉంటే ఆయన నోటి విరేచనాల మందు ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. 
వపన్ కల్యాణ్ ఒక వింత పోకడలు ఉన్న రాజకీయ నాయకుడని… ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరని పేర్ని నాని విమర్శించిన సంగతి తెలిసిందే. షూటింగులకే కాకుండా, రాజకీయాలకు కూడా ఆయన ఆలస్యమేనని ఎద్దేవా చేశారు. పవన్ చేసేది వీకెండ్ ప్రజాసేవ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!