పెట్రోల్‌పై పోటీ ప‌డి మ‌రీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించిన రెండు బంకులు

  • కడపలోని రాజంపేట వెళ్లే మార్గంలో ఘ‌ట‌న‌
  • లీట‌రు పెట్రోలుపై రూ.2 డిస్కౌంట్ ప్ర‌క‌టించిన ఓ బంకు
  • 2.40 రూపాయలు తగ్గిస్తామని మ‌రో బంకు ప్ర‌క‌ట‌న
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోవ‌డంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కడపలోని రాజంపేటకు వెళ్లే మార్గంలోని రెండు బంకులు వాహ‌న‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి. ఇత‌ర పెట్రోల్ బంకుల‌తో పోల్చితే తమ వద్ద లీటరుకు దాదాపు 2 రూపాయలు తక్కువ ధరకే పెట్రోలు పోయించుకోవ‌చ్చ‌ని బోర్డులు పెట్టాయి.

అంతేగాక‌, ఆ రెండు పెట్రోలు బంకులు పోటీ ప‌డి మ‌రీ డిస్కౌంట్ ను కాస్త పెంచుకుంటూ పోవ‌డం గ‌మ‌నార్హం. ఓ పెట్రోల్ బంకు లీట‌రుకు రూ.2 డిస్కౌంట్ ఇస్తామ‌ని బోర్డు పెట్ట‌గా, మ‌రో బంకు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ బోర్డు పెట్టింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!