పూడిమడక సముద్ర తీరంలో విషాదం ..గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో నిన్న గల్లంతైన 7గురిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని రక్షించగా నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. చివరగా జశ్వంత్‌ (నర్సీపట్నం) మృతదేహం తంతడి తీరంలో లభ్యం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక సముద్రతీరంలో విహారానికి రాగా వీరిలో 7గురు గల్లంతైన విషయం తెలిసిందే. గుడివార సూర్యకుమార్‌ మృతదేహం నిన్ననే లభ్యం కాగా ఇవాళ జగదీష్ (గోపాలపట్నం)‌, గణేష్‌ (మునగ పాక) , రామచందు (ఎలమంచి), సతీశ్‌ (గుంటూరు) మృతదేహాలు లభించాయి. కుమారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Nationalist Voice

About Author

error: Content is protected !!