పీరియడ్స్‌లో ఉన్న బాలికలను మొక్కలు నాటొద్దని అడ్డుకున్న టీచర్…

Planting Trees: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ విద్యా సంస్థలో ఈ అవమానం జరిగింది. మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో ఓ మగ టీచర్.. విద్యార్థులందరూ మొక్కలు నాటుతుండగా కొందరు బాలికలను మాత్రం మినహాయించాడు. పీరియడ్స్‌లో ఉన్నవారు దీనికి అనర్హులనే రీతిలో తప్పించారు. పైగా ఇటువంటి కామెంట్లకు పాల్పడింది సైన్స్ టీచర్. దీనిపై ట్రైబల్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ విచారణ జరపనుంది.

12వ తరగతికి పాఠాలు చెప్పే సైన్స్ ఫ్యాకల్టీ ఎవరైనా పీరియడ్స్ లో ఉన్న బాలికలు మొక్కలు నాటితే అవి పెరగడానికి వీల్లేదని, కాల్చేయాలంటూ ఆదేశాలిచ్చాడు. ఈ ఘటనలో త్రింబకేశ్వర్ తాలూకాకు చెందిన దేవగణ్ ప్రాంతంలోని హైయ్యర్ సెకండరీ ఆశ్రమ్ స్కూల్ ఫర్ గర్ల్స్ కు చెందిన అవమానం ఎదుర్కొంది. బాధిత బాలిక కంప్లైంట్ మేర విచారణ జరపనున్నారు.

బాలికల క్లాస్ స్టూడెంట్స్, టీచర్స్, సూపరిండెంట్స్, ప్రిన్సిపాల్ ల గురించి ఎంక్వైరీ చేస్తామని అడిషనల్ కమిషనర్ సందీప్ గోలైట్ అన్నారు. నాశిక్ జిల్లా అదనపు కలెక్టర్, టీడీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్ష మీనా స్కూల్ కు వెళ్లి బాలికను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఆ పాఠశాలలో 500 మంది విద్యార్థినులు చదువుకుంటుండగా ఈ పరాభవం జరిగినట్లు తెలుస్తుంది.

నాశిక్ జిల్లాకు చెందిన శ్రమజీవి సంఘటనా సెక్రటరీ భగవాన్ మాదెను కూడా బాలికల కలిసింది. ఆ టీచర్ ను ఎదిరించలేమని 80శాతం మార్కులు అతని చేతిలో లేదా స్కూల్ అథారిటీస్ చేతిలోనే ఉంటాయని వాపోయింది.

అంతటితో ఆగకుండా స్కూల్ లో జాయిన్ కావాలంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా కంపల్సరీ చేసినట్లు తెలుస్తుంది. టీచర్ కు వ్యతిరేకంగా ఆదివాసీ వికాస్ భవన్ లో మెమొరాండం సబ్ మిట్ చేసినట్లు మాదె పేర్కొన్నారు. టీచర్ పై ఆ తర్వాత మరికొందరు బాలికలు ప్రాథమిక వసతులు కల్పించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!