పిల్లల్లో నాడివ్యవస్ధ అభివృద్ధికి తోడ్పడే జామకాయ…!

పిల్లలకు జామ పండు మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక జామకాయను పిల్లలకు తినిపించటం వల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జామకాయలో అధిక ఫైబర్ కంటెంట్ పిల్లలలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జామ పండ్లు అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి కాబట్టి సామాన్యులు సైతం తినగలిగే పండు ఇది. జామకాయ తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి కనుకే నిపుణులు దీనిని సూపర్ ఫుడ్ అభివర్ణించారు. ముఖ్యంగా జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం ,ఖనిజాలు, ఆరోగ్యానికీ ఎన్నో లాభాలను అందిస్తాయి. నీటిలో కరిగే బి, సి, విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో అధికంగా ఉంటాయి.మలబద్దకం, పేగు మంటను నివారిస్తుంది. జామకాయలోని విత్తనాలలో లినోలెయిక్ మరియు ఫినోలిక్ వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల మెదడు మరియు ఇతర కణజాల వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడతాయి. ఇందులో ఉండే కాల్షియం పిల్లలలో ఎముకల ధృడత్వానికి సహాయపడతాయి.

పిల్లలలో నాడీ సంబంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధికి జామకాయ దోహదం చేస్తుంది. జామపండులో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ పిల్లలలో కంటిచూపును మెరుగుపుస్తుంది. అల్జీమర్స్ , పార్కిన్సన్, హైప్రాక్సియా వంటి ఇతర రుగ్మతల నుండి పిల్లలను రక్షించటంలో తోడ్పడుతుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!