పాదయాత్రలో రాధిక వేములను దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..ఫొటోలు ఇవిగో!

  • హైదరాబాద్ లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
  • రాహుల్ ని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక
  • పూర్తి న్యాయం చేస్తానని రాధికకు రాహుల్ హామీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. మరోవైపు, ఈరోజు తనను కలిసిన రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ ను ఆమె కోరారు. మరోవైపు మీకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. ఇంకోవైపు, రాహుల్ తో రోహిత్ తల్లి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nationalist Voice

About Author

error: Content is protected !!