పాకిస్థాన్ సహా 14 దేశాల్లో దూసుకుపోతున్న అడివి శేష్ ‘మేజర్’

అడివి శేష్ ప్రధాన పాత్రను పోషించిన ‘మేజర్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో, 26/11 ముంబై ఉగ్రదాడుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలో సైతం దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది.
ఓటీటీలో ఈ చిత్రానికి మన దేశంలోనే కాకుండా 14 దేశాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పాకిస్థాన్ తో పాటు 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మూవీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో ఈ చిత్రం నిలిచింది. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, మలేషియా, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, ఖతార్, సింగపూర్, యూఏఈ దేశాల్లో ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఇండియా, నైజీరియా, మారిషస్ లో టాప్ 1 స్థానంలో ఉంది. 
ఈ సందర్భంగా అడివి శేష్ స్పందిస్తూ… తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తనతో పాటు టీమ్ సభ్యులందరూ ఎంతో గర్వపడే సమయం ఇది అని అన్నాడు. ఈ సినిమా తమకు ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!