పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్న ‘వీరమల్లు’

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ .. ఇటీవలే మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో పవన్ పై భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించినట్టుగా సమాచారం.
ఇక మే 2వ వారం నుంచి మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం ఆ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. జూన్ నెలతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసేలా ప్రణాళిక రచన చేశారట. నిధ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ రాంపాల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. 
పవన్ రీ ఎంట్రీ తరువాత చేస్తున్న 3వ సినిమా ఇది. ‘వకీల్ సాబ్’ .. ‘భీమ్లా నాయక్’ ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ‘వీరమల్లు’తో పవన్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అభిమానులంతా భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం పవన్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
Nationalist Voice

About Author

error: Content is protected !!