‘పక్కా కమర్షియల్’తో తొలి రోజే రికార్డు సాధించిన గోపీచంద్..ఏంటంటే..

గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రం జులై 1న విడుదలైంది. గోపీచంద్ లాయర్ పాత్రలో నటించిన ఈ సినిమాపై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 

దాంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి. ఊహించినట్టే తొలి రోజు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా ‘పక్కా కమర్షియల్’ మొదటి రోజు బాగానే రాబట్టింది. గోపీచంద్ కెరీర్ లోనే  తొలి రోజు అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా నిలిచింది.
  
‘పక్కా కమర్షియల్’ రిలీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చిత్ర బృందం ప్రకటించింది. గోపీచంద్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదేనని పేర్కొంది. గోపీచంద్ గత చిత్రం ‘సీటీమార్’ మొదటి రోజు దాదాపు 4.1 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ ఆ రికార్డును బ్రేక్ చేసింది. 

కాగా, ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్య రాజ్‌, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేష్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!