పండగ తర్వాత మళ్లీ ఢిల్లీకి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలపై ఫోకస్

Hyderabad: Telangana Chief Minister K Chandrasekhar Rao addresses during a review meeting with the officials on supply of water to Mission Bhagiratha programme in Hyderabad on Sept 11, 2017. (Photo: IANS)

జాతీయ పార్టీపై పూర్తి స్తాయిలో ఫోకస్ చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను కలవనున్నారు. అటు తెలంగాణ పెండింగ్ సమస్యలపై అధికారులతో భేటీ కాబోతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచాలని నిర్ణయించిన కేసీఆర్.. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు బీఆర్ఎస్ లో విలీనానికి సుముఖత వ్యక్తం చేశాయి. మరికొన్ని పార్టీలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అటు బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదించే ప్రక్రియపైనా ఆరా తీయనున్నారు కేసీఆర్. సీఈసీ బీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దేశవ్యాప్తంగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

Nationalist Voice

About Author

error: Content is protected !!