నేను ఎప్పడూ ఎవరినీ హెల్ప్ అడగలేదు: సుమన్

  • హీరోగా 100కిపైగా సినిమాలు చేసిన సుమన్
  • యాక్షన్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను ఇమేజ్
  • ఆ విషయంలో ఎంజీఆర్ ఆదర్శమన్న సుమన్
  • నిర్మాతలను ఇబ్బందిపెట్టలేదని వెల్లడి
తెలుగులో యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన సుమన్, ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా నిలబడ్డారు. ఆయన పర్సనాలిటీ … హైటూ .. ఆయనకి తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ఆయనను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి .  ‘దేశంలో దొంగలుపడ్డారు’ .. ‘సితార’ .. ’20వ శతాబ్దం’ .. ‘బావా బావమరిది’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.  హీరోగా 100 సినిమాలకి పైగా చేసిన ఆయన, ఆ తరువాత విలన్ గాను .. కేరక్టర్ ఆర్టిస్టుగాను బిజీగా ఉన్నారు.

తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “నాతో సినిమాలు చేసే నిర్మాత్తలు బాగుండాలి .. అప్పుడే వాళ్లు నాతో మరిన్ని సినిమాలు తీయగలుతారని భావించేవాడిని నేను. అందువలన ఎప్పుడూ కూడా ఏ విషయంలోను నిర్మాతలను ఇబ్బంది పెట్టేవాడిని కాదు. ఈ విషయంలో నాకు ఎంజీఆర్ గారు ఆదర్శం” అన్నారు.

“నేను చాలా ఇబ్బ్బందులను దాటుకుంటూ ఎదిగాను. శోభన్ బాబుగారి కూతురు మృదుల మా అమ్మగారి స్టూడెంట్. ఇక కృష్ణగారి కూతురు కూడా మా అమ్మగారి కాలేజ్ లోనే చదువుకున్నారు. అయినా ఆ పరిచయాలను ఉపయోగించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా హార్డు వర్కును నేను నమ్ముకుంటూ ముందుకు వెళ్లానేగాని ఎప్పుడూ ఎవరి హెల్ప్ తీసుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!