నేడే సూర్యగ్రహణం.. ఏ నగరంలో ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందంటే..?

  • ఇండియాలో కొన్ని నగరాల్లోనే కనిపించనున్న గ్రహణం
  • సాయంత్రం 4.29 గంటలకు గ్రహణం ప్రారంభం
  • మన దేశంలో మళ్లీ 2027లో కనిపించనున్న సూర్యగ్రహణం
ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మన దేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించగలం. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు. మన దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈనాటి గ్రహణం మన దేశంలో జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్ కతా నగరాల్లో కనిపిస్తుంది. అయితే, ఈ ప్రాంతాల్లో కూడా మసకబారిన 43 శాతం సూర్యుడిని మాత్రమే చూడగలము.

సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం  4.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఢిల్లీలో సాయంత్రం 4.29, కోల్ కతాలో 4.52, చెన్నైలో 5.14, ముంబైలో 4.49, ద్వారకలో 4.36, తిరువనంతపురంలో 5.29, నాగ్ పూర్ లో 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మరోవైపు, గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!