నేడే .. ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

 

నేషనలిస్ట్ వాయిస్, మే 19. న్యూడిల్లీ :  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ కేసుపై విచారణ జరిపి నేడు కీలక ప్రకటన చేయనుంది. 2019 డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ జరిపిన ఘటన విచారణలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిర్పూర్కర్, రేఖ ప్రకాశ్, కార్తికేయన్ సభ్యులతో కూడిన త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు మూడు సంవత్సరాలుగా తెలంగాణ హైకోర్టు వేదికగా కమిషన్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల విచారణ పూర్తి కావడంతో సిర్పూర్ కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఫేక్ ఎన్‌కౌంటర్.. జరిపారా లేదంటే వాస్తవ పరిస్థితుల్లోనే జరిగిన ఎన్‌కౌంటర్ అనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది. కమిషన్ నివేదిక గోప్యంగా పోలీసులు కోరినట్లు సమాచారం. కాగా నేడు జరిగే విచారణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరుకానున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!