నితిన్‌ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ట్రైల‌ర్‌ లాంచ్ కు స‌ర్వం సిద్ధం….

 హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధంలేకుండా వ‌రుస సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు నితిన్‌. గతేడాది ఏకంగా మూడు సినిమాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దాంతో నితిన్‌ ఆశ‌లన్ని ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ పైనే ఉన్నాయి.ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మొద‌టి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వరుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటిని పెంచుతున్నారు.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ శ‌నివారం విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ట్రైల‌ర్‌కు స‌ర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఇక ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచింది. ప్రేమ‌కథా చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే నితిన్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ మాస్ క‌థ‌తో రానుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో విప‌రీత‌మైన క్యూరియాసిటీ ఏర్ప‌డింది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్ట‌ర్‌గా క‌నిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి స్వ‌రాల‌ను స‌మ‌కూర్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘రా రా రెడ్డి’ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!