నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి కోరుట్లకు కవిత
  • ఎన్నికల నిబంధనలను అనుసరించి తనిఖీలకు సహకరించిన ఎమ్మెల్సీ
  • కవిత కారుతో పాటు వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా తనిఖీ చేసిన పోలీసులు
MLC K Kavithas vehicle was checked by police officials in Nizamabad today

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌ని పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్ నుంచి కోరుట్లకు ప్రయాణించారు. ఈ సమయంలో విధినిర్వహణలో భాగంగా పోలీసులు ఆమె వాహనాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు కవిత సహకరించారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులు తన వాహనాన్ని చెక్ చేస్తున్నంత సేపు ఆమె కాస్త పక్కకు నిలుచుండిపోయారు. తనిఖీకి సహకరించిన ఎమ్మెల్సీకి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!