నా భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే.. చివరకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

  • రేపు విడుదలవుతున్న ‘ఎఫ్ 3’
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి
  • కాలేజీ రోజుల గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన అనిల్
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 3’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తదితరుల నటించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రమోషన్లలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నారు. ఓ ప్రమోషన్ కార్యక్రమంలో అనిల్ మాట్లాడుతూ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

కాలేజీలో తమది పెద్ద బ్యాచ్ అని అనిల్ చెప్పారు. కాలేజీ అయిపోగానే తమ బ్యాచ్ మొత్తం మరో నలుగురు అమ్మాయిల బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్లమని తెలిపారు. ఆ నలుగురు అమ్మాయిల్లో తనకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టమని… ఆ అమ్మయికి తాను సైట్ కొట్టే వాడినని చెప్పారు. ఆ తర్వాత తనకు ఆ బ్యాచ్ లో ఉన్న అమ్మాయితో పెళ్లయిందని.. అయితే ఆ అమ్మాయి తాను సైట్ కొట్టిన అమ్మాయి కాదని తెలిపారు. ఆ అమ్మాయిల బ్యాచ్ లో తన భార్య కూడా ఒకరని… తన భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే… తన భార్య పడిందని చెప్పారు. తన ఫ్రెండ్ కు సైట్ కొట్టావంటూ ఇప్పటికీ తన భార్య తనను దెప్పిపొడుస్తుంటుందని అన్నారు. ప్రతి రోజు తనకు, తన భార్యకు మధ్య ఏదో ఒక విషయమై చిన్న గొడవైనా జరుగుతుంటుందని చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!