నాన్నగారు అందుకున్న ‘కలెక్షన్ కింగ్’ బిరుదుకి నేను అర్హుడిని కాదు: మంచు విష్ణు

  • ‘జిన్నా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు
  • తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబు ప్రస్తావన
  • తండ్రి ఇండస్ట్రీ హిట్స్ గురించి మాట్లాడిన విష్ణు
  • ఆయనతో పోల్చుకోలేమంటూ వెల్లడి
మంచు విష్ణు తాజా చిత్రంగా వచ్చిన ‘జిన్నా’ ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఆయన సొంత బ్యానర్లో వచ్చిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను మంచు విష్ణు కొనసాగిస్తూ ఉండటం విశేషం. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “మొదటి నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అయితే నాన్నగారి డిక్షన్ నాకు లేదు .. అది నా డ్రా బ్యాక్. నాన్నగారి స్ట్రెంథ్ అది .. నా స్ట్రెంథ్ వేరే ఉండొచ్చు” అన్నాడు.

“నాన్నగారి వారసులుగా వచ్చాము కనుక ఆయనతో పోల్చుతూనే ఉంటారు. కానీ అలా పోల్చుకుంటే ఆయనకంటే మేము ఎప్పుడూ తక్కువగానే ఉంటాము. ఆయన ఇంతవరకూ చేసిన విభిన్నమైన పాత్రలలో నేను రెండు .. మూడు కూడా చేయలేదు. అలాంటి అవకాశాలు ఎప్ప్పుడు వస్తాయా అనే ఎదురుచూస్తున్నాను” అని చెప్పాడు.

“మా నాన్నగారు చూసిన విజయాలను మేము ఇంకా చూడలేదు. నేను చేసిన వాటిలో ‘దేనికైనా రెడీ’ .. ‘దూసుకెళతా’ వంటి రెండు మూడు సినిమాలు 30 .. 40 కోట్ల వరకూ రాబట్టాయేమో. అదే నాన్నగారి విషయానికి వస్తే ఎనిమిది .. తొమ్మిది ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన కలెక్షన్ కింగ్ బిరుదును తీసుకునేందుకు నేనింకా అర్హుడిని కాదు .. భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!