నల్ల కుర్తా పైజామాలో నడిచొస్తూ ..‘గాడ్​ ఫాదర్​’ పస్ట్​ లుక్​ వీడియోలో చిరు ఎంట్రీ కేక

మెగాస్టార్ చిరంజీవి  అభిమానులకు మరో ట్రీట్ వచ్చింది. మొన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన అభిమానులకు ఇప్పుడు  ఓ చిన్న వీడియోతో వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది చిత్ర బృందం. నల్ల రంగు కుర్తా పైజామా వేసుకున్న చిరంజీవి అంబాసిడర్ కారు దిగి గంభీరంగా నడుచుకుంటూ పార్టీ ఆఫీసులోకి వెళ్తున్న వీడియో ఆసక్తికరంగా ఉంది. ఒక నిమిషం ఎనిమిది సెకన్ల నిడివితో విడుదల చేసిన ఈ వీడియోలో చిరు ఎంట్రీకి తమన్ ఇచ్చిన  బీజీఎం హైలైట్ గా నిలిచింది. 
      మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని విజయ దశమికి విడుదల చేస్తామని ఈ వీడియోలో చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి వయసుకు సరిగ్గా సరిపోయే పాత్ర ఇది. కాస్త నెరిసిన జట్టుతో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.
 లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. మలయాళంలో మంజూ వారియర్ పోషించిన హీరో చెల్లెలు పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మరో కీలక పాత్రను సత్యదేవ్ పోషించాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
Nationalist Voice

About Author

error: Content is protected !!