నగరవాసులు మేలుకోండి…హైదరాబాద్ ను కాపాడుకోండి…

-111 జీ.వో ఎత్తివేతను అడ్డుకోవాలి….
-కంకణాల రాజిరెడ్డి,రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

హైదరాబాద్, నేషనలిస్ట్ వాయిస్ ప్రత్యేక ప్రతినిధి :

111 జీ.వోను ఎత్తేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రాణాలు అడ్డు పెట్టయినా 111 జీ.వోను. ఎత్తివేతను అడ్డుకోవాలి. లేదంటే బతికి బట్ట కట్టడ లేము అని కంకణాల రాజిరెడ్డి,రిటైర్డ్ ప్రభుత్వ అధికారి సూచించారు. ఇటీవల 111 జీ.వో పరిధిలో లక్ష ఎకరాలకు పైగా భూమి ఉంది. ముందు చూపుతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1996 లోనే అప్పటి ప్రభుత్వం ఈ 111 జీ.వో. తీసుకువ చ్చారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ హైద రాబాద్ కి గుండె కాయలా ఉండి భాగ్యనగర వాసుల దాహం తీర్చే మంచి నీటి వనరులుగా ఉండేవి. ఈ రెండు చెరువులు మోయినాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల పరిసర ప్రాంతాలు.ఆ రెండు చెరువులు కలుషితం కాకూడదు అని దాని చుట్టూ 10 కిలో మీటర్ల మేర ఎలాంటి ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద భవంతులు, కాలు ష్యం వెదజల్లే ప్రాజెక్టులు రాకూడదని ఈ జీ.వో. తీసు కువచ్చారు. హైదరాబాద్ నగర శివారు అనేక గ్రామా లు గ్రీన్ జోన్ గా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో దట్ట మైన వృక్ష సంపద ఉండి, ప్రకృతి సౌందర్యంతో పాటు, మనం వెదజల్లే కాలుష్యాన్ని కూడా తగ్గించ డంలో ఎంతో ఉపయోగపడుతున్నవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యాశకు కకృతి పడి 111 జీ.వో.ఎత్తేస్తే అక్కడ ధరలు పదింతలు పెరుగుతయి, విచ్చల విడి కట్టడాలు, కాలుష్యం చిమ్మే ఫ్యాక్టరీలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముందుగా తన బినామీలతో అక్కడ భూములు కొనిపించి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వేల కోట్ల మామూళ్లు తీసు కుని హైదరాబాద్ ని కాలుష్యం కోరల్లో నెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. గోదావరి నీళ్లు తీసుకోచ్చాం, ఇప్పుడు ఈ సరస్సుల అవసరం లేదు అనేది కొంత మంది అధికార ప్రజాప్రతినిధుల కచరా,బొంకుడు మాటలు, వర్షాలు సరిగా లేకపోతె గోదావరిలొనే నీళ్లు లేని ఈ పరిస్థితుల్లో గోదారి నీళ్లు ఎలా తీసుకు వస్తారు అనేది మేధావులు, సామాన్య ప్రజల ప్రశ్న. ప్రతి హైదరాబాదీ, హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రతి ఒక్కరు దీని మీద పోరాటం చెయ్యకపోతే మీ భవిష్యత్తు కాలుష్యానికి బలవు తుంది. మానవ మనుగడకే ముప్పు వస్తుంది, కావున పరిస్థితికి ప్రశ్నించని ప్రతి ఒక్కరు కారణం అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు 111 జీ.వో పైన పోరాటం చేయాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ జీవోను రద్దు పైన ప్రతి పక్ష పార్టీలు, నాయకులు కూడా 111 జీ.వో ఎత్తివేతపై పోరు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!