దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. లక్షన్నరకు చేరువైన యాక్టివ్ కేసులు!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్తగా నమోదైన రోజువారీ కేసులు 21 వేలను దాటాయి. గత 24 గంటల్లో 4,95,359 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… వీరిలో 21,880 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 21,219 మంది కరోనా నుంచి కోలుకోగా… 60 మంది మృతి చెందారు. 

ఇక ఇప్పటి వరకు 4,31,71,653 మంది కరోనా నుంచి కోలుకోగా… 5,25,930 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసులు లక్షన్నరకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారికంటే కొత్తగా నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,01,30,97,819 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 37 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!