దావూద్ గ్యాంగ్‌తో లింకులు… న‌వ‌నీత్ కౌర్ దంప‌తుల‌పై కేసు

మాజీ సినీ న‌టి, మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్ రాణా దంప‌తుల‌పై మ‌రో కీల‌క కేసు న‌మోదు కానుంది. బొంబాయి బాంబు పేలుళ్ల ప్ర‌ధాన నిందితుడు, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో సంబంధాలు క‌లిగి ఉన్న‌ట్లుగా న‌వ‌నీత్ దంప‌తుల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ముంబై పోలీసులకు బుధ‌వారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా న‌వ‌నీత్ దంప‌తుల‌పై కొత్త కేసు న‌మోదు చేసేందుకు ముంబై పోలీసులు సిద్ధ‌మయ్యారు.

దావూద్‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై బాలీవుడ్ నిర్మాత యూసుఫ్ లక్డావాలాను ఇప్ప‌టికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ల‌క్డావాలా నుంచి న‌వ‌నీత్ దంప‌తులు రూ.80 ల‌క్ష‌ల‌ను అక్ర‌మంగా వ‌సూలు చేశార‌న్న‌ది సంజ‌య్ రౌత్ ఆరోప‌ణ‌. ఈ ఆరోప‌ణ‌ల‌తోనే ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే హ‌నుమాన్ ఛాలీసా వివాదంలో అరెస్టయిన న‌వ‌నీత్ దంప‌తులు.. తాజా కేసు న‌మోదైతే మ‌రింత మేర ఇబ్బందుల‌కు గురి కాక త‌ప్ప‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!