త్వరలో ముసరాంబాగ్, చాదర్‌ ఘాట్ నూతన బ్రిడ్జిల నిర్మాణం : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్‌ ఘాట్‌ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్లు, చాదర్ ఘాట్ నిర్మాణానికి రూ.42 కోట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ చొరవతో నిధులు మంజూరయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

 

 

 

Nationalist Voice

About Author

error: Content is protected !!