త్రివిక్రమ్ తో మహేశ్ బాబు ‘అర్జునుడు’?

  • మహేశ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో
  • ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు
  • ఆ రోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసే  ఛాన్స్
  • వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే ఆలోచన
మహేశ్ బాబు తాజా చిత్రంగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు ‘సర్కారువారి పాట’ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మహేశ్ బాబు ఈ సినిమా తరువాత ప్రాజెక్టును త్రివిక్రమ్ తో చేయనున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.

ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నా రట. దాదాపు అదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఇది ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమెకి అటు త్రివిక్రమ్ తోను .. ఇటు మహేశ్ బాబుతోను పనిచేసిన అనుభవం ఉంది. ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు ఉందని అంటున్నారు. ఆ పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారట.  సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!