తొలి టీ20లో ఐర్లండ్ ను చిత్తు చేసిన టీమిండియా.. మరో రికార్డు సాధించిన పాండ్యా!

Hardhik Pandya new record in T20నిన్న రాత్రి జరిగిన తొలి టీ20లో ఐర్లండ్ ను టీమిండియా చిత్తు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐర్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలో ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ దీపక్ హుడా 47 పరుగులు (నాటౌట్), ఇషాన్ కిషన్ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 24 పరుగులు దినేశ్ కార్తీక్ 5 పరుగులు (నాటౌట్) చేశారు.ఈ మ్యాచ్ లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్ గా ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా… ఐర్లండ్ ఓపెనర్ స్టిర్లింగ్ (4)ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. మరోవైపు పొట్టి ఫార్మాట్ లో టీమిండిగా కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించిన ఎనిమిదో ఆటగాడు పాండ్యా కావడం గమనార్హం.
Nationalist Voice

About Author

error: Content is protected !!