తెలుగులో 25 కోట్లకి పైగా కొల్లగొట్టిన ‘కాంతార’

  • తెలుగులో ఈ నెల 15వ తేదీన విడుదలైన ‘కాంతార’
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
  • 10 రోజుల్లో 27.60 కోట్ల గ్రాస్ వసూలు
  • పోటీని ఇవ్వలేకపోయిన దీపావళి సినిమాలు
రిషబ్ శెట్టి హీరోగా కన్నడలో రూపొందిన ‘కాంతార’ సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైంది. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన  ఈ సినిమాకి రిషబ్ శెట్టి రచయిత .. దర్శకుడు కూడా. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ రోజు నుంచి వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ వెళుతోంది. 8 రోజుల్లో 50 కోట్లను .. 15 రోజుల్లో 100 కోట్లను రాబట్టిన ఈ సినిమా,  23 రోజుల్లో 200 కోట్ల మార్కును అందుకుంది.

ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేశారు. కథాకథనాల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది. పది రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 25 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. 10 రోజుల్లో 15.13 కోట్ల షేర్ ను .. 27.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం చెప్పుకోదగిన విషయమే.

దీపావళి పండుగ సందర్భంగా మూడు తెలుగు సినిమాలు .. కార్తి ‘సర్దార్’ రంగంలోకి దిగినప్పటికీ, ‘కాంతార’ వసూళ్లు తగ్గకపోవడం విశేషం. దగ్గరలో పోటీ ఇవ్వగలిగే సినిమాలు ఏమీ లేకపోవడం వలన, వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా సప్తమి గౌడ అలరించిన సంగతి తెలిసిందే.

Nationalist Voice

About Author

error: Content is protected !!