తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల..

Telangana Inter results out

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా… సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది పాస్ అయ్యారు. 
ఇంటర్ ఫలితాల్లో ఈ సారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో 72.33 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 54.25 శాతం మంది అబ్బాయిలు మాత్రమే పాస్ అయ్యారు. సెకండియర్ లో 59.21 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా… 75.28 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. 
tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మరోవైపు, ఆగస్ట్ 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని సబిత తెలిపారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!