తెలంగాణ ఆద‌ర్శ గ్రామాల జాబితాలో కోమ‌టిరెడ్డి ద‌త్త‌త గ్రామానికి ఫస్ట్ ప్లేస్‌

  • సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల జాబితాలో తెలంగాణ స‌త్తా
  • టాప్ 10 గ్రామాల‌న్నీ తెలంగాణ ప‌ల్లెలే
  • కోమ‌టిరెడ్డి ద‌త్త‌త గ్రామానికి టాప్ పొజిష‌న్‌

కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం నాడు ప్ర‌క‌టించిన సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల జాబితాలో టాప్ 10 స్థానాల‌న్నింటినీ కైవ‌సం చేసుకున్న తెలంగాణ ప‌ల్లెలు… టాప్ 20లో ఏకంగా 19 స్థానాల‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాకు సంబంధించి మ‌రో ఆస‌క్తికర విష‌యం వెలుగు చూసింది.

ఈ జాబితాలో భువ‌న‌గిరి మండ‌లానికి చెందిన వ‌డ‌ప‌ర్తి గ్రామం టాప్‌లో నిలిచింది. ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ద‌త్త‌త తీసుకున్న గ్రామం‌. ఇక జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన ఆలేరు మండలం కొలనుపాక గ్రామం కూడా కోమ‌టిరెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనిదే‌. టాప్ 10లో నిలిచిన ప‌ది గ్రామాల్లో రెండు గ్రామాలు కోమ‌టిరెడ్డి నియోజక‌వ‌ర్గ ప‌రిధిలోనివే. ఈ విష‌యాన్ని బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించిన కోమ‌టిరెడ్డి ఆయా గ్రామాల ప్ర‌జా ప్ర‌తినిధులు, గ్రామ‌స్థుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!