తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 13 మండ‌లాలు…

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 10 జిల్లాల‌తో ఏర్పాటైన తెలంగాణ ఆ తర్వాత 33 జిల్లాల రాష్ట్రంగా మారింది. ఈ సంద‌ర్భంగా కొత్తగా ప‌లు రెవెన్యూ డివిజ‌న్లు, ప‌లు మండ‌లాలను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ప‌రిపాల‌నా సౌల‌భ్యం, ప్ర‌జ‌ల విన‌తుల మేర‌కు మ‌రో 13 కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. 

1.నారాయణ పేట జిల్లాలోని అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్, కొత్తపల్లె మండలాలు
2.వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్ మండలం
3.మహబూబ్ నగర్ జిల్లాలోని అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల మండలం
4.నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు
5.నిజామాబాద్ జిల్లా, బోaధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం
6.మహబూబాబాద్ జిల్లాలోని అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో సీరోల్ మండలం
7.నల్లగొండ జిల్లాలోని అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్ మండలం
8.సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలం
9.కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం
10.జగిత్యాల జిల్లాలోని అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎండపల్లి మండలం
11.జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలం

Nationalist Voice

About Author

error: Content is protected !!