తెలంగాణలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు… పలు రైళ్ల రద్దు, పరీక్షలు వాయిదా వేసిన కాకతీయ, ఉస్మానియా

రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాదులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పలు చోట్ల నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా, భారీ వర్షాల ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 

రద్దుయిన రైళ్లు ఇవే…
సికింద్రాబాద్-ఉందా నగర్ (07077)
సికింద్రాబాద్-ఉందా నగర్ మెము స్పెషల్ (07055)
మేడ్చల్-ఉందా నగర్ మెము స్పెషల్ (07076)
ఉందా నగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ (07056)
సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ (07059/07060)
హెచ్ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ స్పెషల్ (07971/07970)
సికింద్రాబాద్-మేడ్చెల్ మెము స్పెషల్ (07438)
మేడ్చెల్-సికింద్రాబాద్ మెము స్పెషల్ (07213)

అటు, పలు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. నేడు, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. పరీక్షలు జరిగే కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!