తిరుమలలో బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. మాస్క్‌లో రూ.2వేల నోట్లు దాచి ఎస్కేప్ అవుతుండగా పట్టుకున్న అధికారులు

తిరుమల పరకామణిలో బ్యాంక్ ఉద్యోగి చేతివాటం బయటపడింది. శ్రీవారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో ఓ బ్యాంకు ఉద్యోగి చోరీకి యత్నించి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీవారి కానుకలను లెక్కించే పరకామణిలో ఓ బ్యాంక్ ఉద్యోగి రూ.94వేలు దాచేశాడు. రెండు వేల రూపాయల నోట్లను మాస్క్ లో దాచేసి ఎస్కేప్ అవుతుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించటంతో అడ్డంగా దొరికిపోయాడు. దిలీప్ అనే బ్యాంక్ ఉద్యోగి పరకామణిలో నుంచి రూ.94వేలు చోరీ చేసాడు.

ఎవ్వరు తనను పట్టుకోరనే ధైర్యమో లేక అక్కడి డబ్బు చూసి దురాశ పుట్టిందో గానీ తానో ఉద్యోగి అనే విషయం కూడా మర్చిపోయి సాక్షాత్తూ దేవుడి సొమ్మునే కొట్టేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాడు. కానుకల లెక్కింపు తరువాత రూ.47 రెండువేల రూపాయల నోట్లను మాస్క్ లో పెట్టుకుని బయటకు వస్తుండగా విజిలెన్స్ అధికారులు అనుమానించారు. వెంటనే మాస్క్ తీయాలని ఆదేశించగా దిలీప్ దొంగతనం బయటపడింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా దిలీప్ ఇటువంటి చిల్లర పనులు చేయటం మొదటిసారికాదు. గతంలో కూడా దిలీప్ చేసిన చోరీలు బయటపడ్డాయి. అయినా ఎవ్వరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో బరితెగించి శ్రీవారి కానుకలనే కొట్టేయటానికి సిద్ధపడ్డాడు. ఏడాది నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా కొనసాగుతున్న దిలీప్ లడ్డూల కౌంటర్ లో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. కానీ ఎందుకు అతినిపై చర్యలు తీసుకోకపోవటంతో తాజాగా పరకామణిలో కానుకలు లెక్కించి రూ.94వేలు చోరీ చేసి అధికారులకు దొరికిపోయాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!