తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని తెలిసిందే. వర్షాలు పడుతుండడంతో ఆయన తన పొలాల్లో వ్యవసాయపనులు ప్రారంభించారు. ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో వ్యవసాయకూలీలతో కలిసి సాగు పనుల్లో పాల్గొన్నారు. కలుపు ఏరి, పొలంలో నాట్లు వేయడానికి అనువుగా మెరకలు, పల్లాలను చదును చేయడానికి నిచ్చెన లాగారు. ఆపై, నారుమడికి విత్తనాలు చల్లారు. కంది నాట్లు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలతో కలిసి భోజనం చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!